Home న్యూస్ 5 ఇండస్ట్రీ హిట్స్ హీరో…180 కోట్ల సినిమా….కలెక్షన్స్ చూసి అందరి మైండ్ బ్లాంక్!!

5 ఇండస్ట్రీ హిట్స్ హీరో…180 కోట్ల సినిమా….కలెక్షన్స్ చూసి అందరి మైండ్ బ్లాంక్!!

0

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లాస్ట్ దశాబ్డంన్నరలో ఏకంగా 5 ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరో అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా సినిమా ఇలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ అంచనా కూడా వేయలేదు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందే సినిమాను వివిధ కారణాల వలన బాయికాట్ చేయాలి అంటూ సోషల్ మీడియా లో విపరీతమైన…

నెగటివ్ ప్రచారం ఈ సినిమా పై పడగా ఆ ఇంపాక్ట్ సినిమా కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది. సినిమా కి టాక్ కూడా బిలో యావరేజ్ లెవల్ లోనే వచ్చినా కానీ అమీర్ ఖాన్ స్టార్ డంతో అయినా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అనుకున్నా అలాంటిది…

ఏమి జరగక పోవడం విచార కరం అని చెప్పాలి… 5 ఇండస్ట్రీ హిట్స్ తర్వాత అమీర్ ఖాన్ చేసిన తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా ఫస్ట్ డే 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమా 6 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ గా…

47.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, 6వ రోజు కేవలం 2 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమె అందుకోగా మొత్తం మీద షేర్ 24కోట్లు మాత్రమె ఉంటుందని అంచనా. సినిమా కోసం ఏకంగా 180 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారని సమాచారం. ఆ రేంజ్ బడ్జెట్ కి 24 కోట్ల షేర్ రికవరీ అంటే బడ్జెట్ పరంగా ఈ సినిమా అమీర్ ఖాన్ కెరీర్ లోనే కాదు…

టోటల్ బాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ముందు నిలిచే సినిమాగా మారబోతుంది. 5 ఇండస్ట్రీ హిట్స్ రికార్డ్ ఉన్న హీరో సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ రావడం చూసి ట్రేడ్ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సౌత్ డబ్బింగ్ రిలీజ్ లు మినిమమ్ ఇంపాక్ట్ కూడా చూపించలేక పోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here