పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) లాంగ్ వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి కలెక్షన్స్ పరంగా 5వ రోజున బాగానే హోల్డ్ చేసి జోరు చూపించగా 6వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…
5 కోట్లు ఆ పైన షేర్ రావొచ్చు అనుకున్నా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో కొంచం ఎక్కువగా డ్రాప్ అయ్యి 4.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు, కానీ హిందీలో బాగా హోల్డ్ చేయడం, ఓవర్సీస్ లో కూడా పుంజుకోవడంతో ఓవరాల్ గా సినిమా…
వరల్డ్ వైడ్ 6వ రోజు కలెక్షన్స్ 12 కోట్ల రేంజ్ లో ఉంటాయి అనుకుంటే ఆ మార్క్ ని దాటేసి 12.80 కోట్ల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజుల్లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Salaar 6 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 61.58Cr
👉Ceeded: 17.12CR
👉UA: 13.31Cr
👉East: 9.15Cr
👉West: 6.00Cr
👉Guntur: 8.49Cr
👉Krishna: 6.52Cr
👉Nellore: 4.15Cr
AP-TG Total:- 126.32CR (192.35CR~ Gross)
👉KA: 18.50Cr
👉Tamilnadu: 9.05Cr
👉Kerala: 5.60Cr
👉Hindi+ROI: 45.70Cr
👉OS – 48.60Cr*****
Total WW Collections: 253.77CR(Gross- 459.80CR~)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 93.23 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.