Home న్యూస్ 6 గంటల్లో 12M…ఇటు ఏకంగా 1M….డైనోసార్ అరాచకం ఇది!

6 గంటల్లో 12M…ఇటు ఏకంగా 1M….డైనోసార్ అరాచకం ఇది!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో సెప్టెంబర్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్…

మరీ అంచనాలను అందుకోకపోయినా కానీ ఓవరాల్ గా టీసర్ లో ప్రభాస్ ను రివీల్ చేయకుండా సైడ్ యాంగిల్స్ నుండి చూపించిన మాస్ సీన్స్ తో ఫ్యాన్స్ కొద్ది వరకు సాటిస్ ఫై అయ్యారు… అలాగే ప్రభాస్ ను జురాసిక్ పార్క్ లో డైనోసార్ లా వర్ణిస్తూ…

ఇచ్చిన ఎలివేషన్స్ తో బాగానే సాటిస్ ఫై అయినా ఇతర ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఎక్కువే ఈ టీసర్ నుండి ఎక్స్ పెర్ట్ చేశారని చెప్పాలి. ఇక రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ సినిమా మీద ఉన్న హైప్ తో ఈ టీసర్ కి వ్యూవర్ షిప్ అలాగే లైక్స్ నెక్స్ట్ లెవల్ లో…

దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం. టీసర్ రిలీజ్ అయిన 6 గంటల టైంకి టీసర్ ఏకంగా యూట్యూబ్ లో 12 మిలియన్ అప్ డేట్ అయిన వ్యూస్ ని క్రాస్ చేయగా లైక్స్ పరంగా ఏకంగా 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది.

1 మిలియన్ లైక్స్ ని తక్కువ టైంలో అందుకోవడం అన్నది మామూలు విషయం కాదు. ఇది కూడా మరీ రికార్డ్ బ్రేకింగ్ కాక పోయినా కానీ సినిమా మీద అంచనాలను రుజువు చేస్తూ ఎక్స్ లెంట్ స్పీడ్ తో దూసుకు పోతూ ఉండగా 24 గంటలు పూర్తీ అయ్యే టైంకి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here