బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు మంచి వసూళ్ళనే ఓవరాల్ గా సొంతం చేసుకున్న రాధే శ్యామ్ సినిమా వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపలేక రోజు రోజుకి కలెక్షన్స్ లో డ్రాప్స్ అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా ఉండటం తో ఇక ఇప్పుడు సినిమా ఊహకందని నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు ఇప్పుడు…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల నుండి 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ లో సినిమా మరోసారి ది కాశ్మీర్ ఫైల్స్ ఊరమాస్ గ్రోత్ ని చూపెట్టడంతో సినిమా అక్కడ మరిన్ని స్క్రీన్స్ ని ఈ రోజు కోల్పోవాల్సి వచ్చింది…
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అక్కడ ఈ రోజు 70 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఈ లెక్కన సినిమా ఇప్పుడు బిజినెస్ వాల్యూ 202.80 కోట్ల రేంజ్ లో ఉండటంతో చరిత్రలో నిలిచిపోయే నష్టాలు సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండటం నిజంగానే విచారకరం…