బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ వర్కింగ్ డేస్ లో మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపెట్టలేక చేతులు ఎత్తేసింది.. సినిమా వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి 4 వ రోజు 80% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 5 వ రోజు కి వచ్చే సరికి సినిమా 50% లోపు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…
ఇక ఇప్పుడు 6 వ రోజు లో ఎంటర్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు తో పోల్చితే ఇప్పుడు 6 వ రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 35% టు 40% వరకు డ్రాప్స్ ను మరోసారి సొంతం చేసుకుంది ఇప్పుడు….
దాంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీ లో సినిమా ఈ రోజు మరింత స్లో అవ్వగా అక్కడ సినిమా 80 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది… కొండంత టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉన్న ఈ సినిమా ఈ రేంజ్ లో డ్రాప్స్ ని అసలు ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి…