Home న్యూస్ హిందీలో ప్రభాస్ కి ఎన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయో తెలుసా…సౌత్ రికార్డ్!

హిందీలో ప్రభాస్ కి ఎన్ని 100 కోట్ల సినిమాలు ఉన్నాయో తెలుసా…సౌత్ రికార్డ్!

0

బాహుబలి(Baahubali) సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి తన మార్కెట్ ను అన్ని చోట్లా స్టేబుల్ చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం, తెలుగు రాష్ట్రాల తర్వాత ప్రభాస్ కి హిందీ మార్కెట్ బిగ్గెస్ట్ మార్కెట్ గా నిలిచింది…

బాహుబలి సిరీస్ తర్వాత చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఒక్క రాదే శ్యామ్ మాత్రమే తీవ్రంగా నిరాశ పరిచిన సినిమాగా నిలవగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా మంచి కలెక్షన్స్ నే ఓవరాల్ గా సొంతం చేసుకోవడం విశేషం. లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie) సినిమా…

హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఎక్స్ లెంట్ పాజిటివ్ టాక్ హెల్ప్ వలన సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ హిందీలో కుమ్మేసింది. 100 కోట్ల మార్క్ ని అవలీలగా దాటేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో హిందీలో 6 వ సారి 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…

   

అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించగా సౌత్ నుండి హిందీలోకి వెళ్ళిన స్టార్స్ ఎవ్వరూ కూడా ప్రభాస్ దరిదాపుల్లో కూడా లేరంటే ఏ రేంజ్ లో ప్రభాస్ డామినేషన్ ఉందో అర్ధం చేసుకోవచ్చు…కానీ మధ్యలో రాదే శ్యాం ఒక మాయని మచ్చగా మారగా…

ఈ సినిమా కన్నా ముందు హిందీలో ప్రభాస్ హాట్రిక్ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రాదే శ్యామ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్, సలార్ ఇప్పుడు కల్కి మూవీస్ తో హాట్రిక్ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపాడు….

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ మూవీస్ లో యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే బాహుబలి2 తర్వాత ప్రభాస్ కి హిందీలో రెండో 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలవనుంది…లాంగ్ రన్ లో హోల్డ్ చేస్తే అంతకు మించి కూడా రాంపెజ్ ను చూపించడం ఇప్పుడు ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here