ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో వీర లెవల్ లో కుమ్మేసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా సినిమా పండగ సెలవుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మూవీ…
హెవీ డామినేషన్ వలన స్లో డౌన్ అయింది నైజాం ఏరియాలో…ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో పర్వాలేదు అనిపిస్తూ దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా 5వ రోజుతో పోల్చితే 6వ రోజున టికెట్ సేల్స్ లో డ్రాప్స్ అయితే సొంతం చేసుకుంది. ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా…
ఓవరాల్ గా 35-40% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కౌంటర్ దగ్గర పర్వాలేదు అనిపించేలా ఉన్న నేపధ్యంలో నైట్ షోలు బాగానే పెర్ఫార్మ్ చేస్తే సినిమా 6వ రోజున ఇప్పుడు 2.6-2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఓవరాల్ గా షేర్ కొంచం పెరిగి 3 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా కి వర్కింగ్ డే వలన డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా అన్ని చోట్లా కలిపి సినిమా 6వ రోజున ఇప్పుడు…
3.2-3.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు….మొత్తం మీద శని ఆదివారాల్లో సినిమా తిరిగి జోరు చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 6 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.