బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara part 1) 5 రోజుల్లో ఓవరాల్ గా మాస్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు ఇప్పుడు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో….
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డే 5తో పోల్చితే కొన్ని చోట్ల 60% గ్రోత్ కొన్ని చోట్ల 70-80% రేంజ్ లో గ్రోత్ కొన్ని చోట్ల ఏకంగా 100% గ్రోత్ కనిపిస్తూ ఉండగా సినిమా ఓవరాల్ గా ఇదే ట్రెండ్ ను…
ఈవినింగ్ అండ్ నైట్ షోల దాకా కొనసాగిస్తే సినిమా అనుకున్న అంచనాలకు మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఈ రోజు ఇదే విధంగా….
ఈవినింగ్ అండ్ నైట్ షోలలో జోరు కొనసాగిస్తే అటూ ఇటూగా 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, రేపు మళ్ళీ వర్కింగ్ డే అవ్వడంతో నైట్ షోలకు డ్రాప్స్ ఉండే అవకాశం ఉంది, అది లేక పొతే ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది.
ఇక హిందీలో సినిమా ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం, కర్ణాటకలో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా తమిళ్ అండ్ కేరళలో మాత్రం అనుకున్న రేంజ్ లో గ్రోత్ అయితే లేదు అని చెప్పాలి…
అలాగే ఓవర్సీస్ లో ఇవాళ కొంచం డ్రాప్స్ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 6వ రోజు టోటల్ గా 15-16 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా హోల్డ్ చేస్తుంది ఈ అంచనాలను మించి పోతుందో లేదో చూడాలి ఇక…