బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మొదటి 5 రోజుల్లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కానీ ఆదివారం రోజున ఆరెంజ్ సినిమా వలన కొంచం ఇంపాక్ట్ పడి కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అవ్వగా ఇప్పుడు 6వ రోజున సినిమా వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా భారీగానే…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్ అయ్యింది అని చెప్పాలి. 5వ రోజుతో పోల్చితే సినిమా 50% వరకు రేంజ్ లో డ్రాప్ అయితే డీసెంట్ హోల్డ్ ఉండొచ్చు అనుకున్నా సినిమా ఏకంగా 70% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచం బాగుంటే కొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా…
ఈ రోజు 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇది కూడా ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు డీసెంట్ గా ఉంటెనే సాధ్యం అని చెప్పాలి. లేదంటే కలెక్షన్స్ ఇంకొంచం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక టోటల్ గా సినిమా 6 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.