పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో సినిమా 5వ రోజున మంచి కలెక్షన్స్ తో జోరు చూపించింది. సినిమా ఇక 6వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా అన్ని చోట్లా కూడా…
సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 40-50% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, హిందీలో మాత్రం మంచి హోల్డ్ కనిపిస్తూ ఉండగా మిగిలిన చోట్ల డ్రాప్స్ ఉన్నాయి, ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా కొద్ది వరకు పుంజుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఒకవేళ సినిమా ఈ మార్క్ ని దాటేసి 10-11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 6వ రోజును మొత్తం మీద…
మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం స్టడీ కలెక్షన్స్ జోరుని లాంగ్ రన్ లో ఇలానే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా వీకెండ్ లో సినిమా తిరిగి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే 6 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…