బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా కానుకగా రిలీజ్ అయిన దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(Leo Movie) మరియు మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమాలు దసరా హాలిడే రోజున మంచి జోరునే చూపిస్తూ దూసుకు పోతున్నాయి అని చెప్పాలి…
లియో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నా కూడా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
ఇక 5వ రోజులో అడుగు పెట్టిన ఈ సినిమా దసరా హాలిడే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా మంచి ట్రెండ్ ను చూపిస్తూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ లో డే 4 తో పోల్చితే 15-20% రేంజ్ లో గ్రోత్ అయితే కనిపిస్తూ ఉండటంతో సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.6 కోట్ల రేంజ్ నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఇక లియో మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 6 వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా కొన్ని చోట్ల గ్రోత్ కూడా ఉంది, దాంతో సినిమా 6వ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.8 కోట్ల రేంజ్ నుండి 2 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి…
50 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, టైగర్ నాగేశ్వరరావు సినిమా 3 కోట్ల నుండి 3.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక 2 సినిమాల ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…