Home న్యూస్ 157 – 156 అయిందిగా….చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ!

157 – 156 అయిందిగా….చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన రీసెంట్ మూవీస్ లో ఆచార్య(Acharya) మరియు గాడ్ ఫాదర్(God Father) సినిమాల నిరాశ పరిచే రిజల్ట్ తర్వాత ఈ ఇయర్ లో వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) తో ఎపిక్ కంబ్యాక్ హిట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో…

భోలా శంకర్(Bholaa Shankar) సినిమాతో భారీగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత చిరు తర్వాత చేయబోయే సినిమాలు 156వ సినిమా కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఉండగా 157 వ సినిమా బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్ లో ఉండబోతూ ఉండగా 156వ సినిమా ను ఇప్పుడు భోలా శంకర్ సినిమా రిజల్ట్ వలన….

అనుకోకుండా కాన్సిల్ చేసి ఇప్పుడు 157 వ సినిమాను 156 వ సినిమా గా మార్చగా రీసెంట్ గా దసరా కానుకగా సినిమాను స్టార్ట్ చేశారు… మెగాస్టార్ కెరీర్ లోనే ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమా…

వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. సోషియో ఫాంటసీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొంచం స్టోరీ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుండి తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తూ ఉండగా..

భారీ గ్రాఫిక్ హంగులతో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు…. ఓవరాల్ గా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కబోతుండగా వచ్చే ఏడాది సినిమా అనుకున్నట్లు అంచనాలను అందుకుంటే మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here