యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తొలి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ చాలా వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమాకి నైజాం కలెక్షన్స్ కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేయడం లాంటివి…
ఓవరాల్ కలెక్షన్స్ పై బాగానే ఇంపాక్ట్ ని చూపాయి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా 6 వ రోజు మొత్తం మీద 9 లక్షల షేర్ ని అందుకుంటే…7 వ రోజు కి వచ్చే సరికి కేవలం 5 లక్షల షేర్ నే సొంతం చేసుకుంది. చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు కూడా 7 వ రోజు పడ్డాయి…
సినిమా బడ్జెట్ 7.5 కోట్ల రేంజ్ లో ఉన్నప్పటికీ నాన్ థియేట్రికల్ అండ్ థియేట్రికల్ బిజినెస్ తో నిర్మాత సేఫ్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన 2.75 కోట్ల బిజినెస్ ను సినిమా రికవరీ చేయడానికి కష్టాలు పడుతున్నా వర్కింగ్ డేస్ రిజల్ట్ తో సినిమా ఫేట్ డిసైడ్ అయ్యింది.
మొత్తం మీద సినిమా మొదటి వారంలో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 50L
👉Ceeded: 32L
👉UA: 25L
👉East: 18L
👉West: 12L
👉Guntur: 19L
👉Krishna: 13L
👉Nellore: 9L
Total AP TG: 1.78CR(3.12CR~ Gross)
👉KA+ROI: 5L
👉OS: 1L~
TOTAL Collections: 1.84CR(3.26CR~ Gross)
ఇదీ సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్…
సినిమాను 2.75 కోట్లకు అమ్మగా సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది… సినిమా మొదటి వారం తర్వాత క్లీన్ హిట్ కోసం మరో 1.16 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది… సెకెండ్ వీక్ లో లవ్ స్టొరీ కోసం చాలా థియేటర్స్ ని ఈ సినిమా కోల్పోయింది. దాంతో ఇక బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం అని చెప్పాలి. టోటల్ కలెక్షన్స్ లో లాస్ ఎంత కవర్ చేస్తుందో చూడాలి ఇప్పుడు.