గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ గా కుమ్మినా తర్వాత వీకెండ్ లో పర్వాలేదు అనిపించుకుంది, కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి చాలా స్లో డౌన్ అయింది, నైజాం కలెక్షన్స్ బాగుంటే సినిమా పరిస్థితి…
చాలా బెటర్ గా ఉండేది కానీ నైజాం కలెక్షన్స్ అండర్ పెర్ఫార్మ్ చేయడం తో ఆ ఇంపాక్ట్ ఓవరాల్ కలెక్షన్స్ పై పడ్డాయి, అయినా కానీ సినిమా వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించే విధంగా తక్కువ డ్రాప్స్ తో 5 వ రోజు నుండి బాగానే హోల్డ్ చేస్తూ వచ్చింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 వ రోజు తో పోల్చితే 7 వ రోజు 5 లక్షల డ్రాప్స్ ను మాత్ర్రమే సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి 6 వ రోజు 43 లక్షలు వస్తే 7 వ రోజు 38 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసి….
రెండో వారం పై ఆశలు పెరిగేలా చేసింది ఇప్పుడు. ఇక సినిమా మొదటి వారం టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 2.27Cr
👉Ceeded: 1.63Cr
👉UA: 1.11Cr
👉East: 86L
👉West: 49L
👉Guntur: 98L
👉Krishna: 50L
👉Nellore: 43L
Total AP TG: 8.27CR(13.68CR~ Gross)
👉KA+ROI: 32L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 8.67CR(14.55CR~ Gross)
సినిమాను మొత్తం మీద 11.5 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి వారం సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 3.33 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వారంలో సినిమా ఎలాంటి ప్రదర్శన చూపుతుందో చూడాలి ఇక.