Home న్యూస్ 70 కోట్ల అప్పులు…అందుకే తప్పలేదు….సూర్య ఎట్టకేలకు చెప్పేశాడు!

70 కోట్ల అప్పులు…అందుకే తప్పలేదు….సూర్య ఎట్టకేలకు చెప్పేశాడు!

4

ఎట్టకేలకు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న అద్బుతం జరగనే జరిగింది, కమర్షియల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్న సూర్య తన స్టైల్ లోనే డిఫెరెంట్ మూవీ తో తన యాక్టింగ్ తోనే సినిమాను నిలబెట్టి అద్బుత నటనకి గాను అందరి చేత మెప్పు పొందాడు, సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ఆకాశం నీ హద్దు రా కి అద్బుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుండగా సినిమా ను ఇలా డైరెక్ట్ రిలీజ్ ఎందుకు….

చేయాల్సి వచ్చింది అన్నది క్లియర్ గా అందరికీ చెప్పుకొచ్చాడు సూర్య… జ్యోతిక సినిమా డైరెక్ట్ రిలీజ్ టైం లో తనకి 70 కోట్ల అప్పులు ఉన్నాయి ఈ సినిమాను ఆపేవారు ఆ అప్పులు తీర్చుతారా అంటూ కామెంట్స్ చేసిన సూర్య… ఇప్పుడు ఆ విషయాన్నీ చెబుతూ…

నిజంగానే అంత అప్పు ఉందని, అలాగే నేను నిర్మాతగా మారి 8 సినిమాలు చేస్తూ ఉండటం, అవన్నీ కూడా ప్రొడక్షన్ లో ఉండటం తో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యాయని చెబుతూ, నేను ఒక వ్యక్తీని మాత్రమేనని కార్పోరేట్ కంపెనీలా కోట్లకు కోట్లు పెట్టుకుని బిజినెస్ చేయడం లేదని చెప్పుకొచ్చారు సూర్య… ఈ సినిమాలతో నా ఒక్కడికే కాకుండా….

ఎన్నో వందల కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్న టైం లో అందరినీ ఆదుకోవాల్సిన అవసరం నా మీద పడటం తో ఇలా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని, ఈ సినిమా ఒప్పందం వలన వచ్చిన చెక్ తో అందరి కష్టాలను అవసరాలను తీర్చగలిగానని దానికి గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు సూర్య…

తన మీద ఆధారపడిన వారిని ఆదుకోవడానికి ఉన్న ఆప్షన్స్ లో సేఫ్ ఆప్షన్ ని ఎంచుకున్న సూర్య వాళ్ళని ఆడుకోవడమే కాకుండా ఇప్పుడు తనకున్న అప్పులను కూడా క్లియర్ చేసుకోగలిగారు, ఆకాశం నీ హద్దురా డిజిటల్ రిలీజ్ అయినా కానీ ఆడియన్స్ అందరూ సూర్య నటనకి ఫిదా అవుతూ సినిమాను ఓ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో సూర్య డబుల్ హ్యాప్పీగా ఉన్నారని చెప్పొచ్చు.

4 COMMENTS

  1. నైస్ మూవీ సూర్య గారు మీ మూవీ లు అని చూస్తుంటాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here