Home న్యూస్ ఇండియాలో టాప్ 3…ఒక్కడి పేరు మీద…ఇదీ రికార్డ్ అంటే!!

ఇండియాలో టాప్ 3…ఒక్కడి పేరు మీద…ఇదీ రికార్డ్ అంటే!!

1262
0

గత మూడు సినిమాలుగా బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ లతో సెన్సేషనల్ హిట్స్ కొడుతున్న కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ ఆ రికార్డులతో పాటు యూట్యూబ్ లో తన సినిమాల టీసర్ లు అండ్ ట్రైలర్ లు రిలీజ్ అయిన ప్రతీ సారి కూడా కొత్త రికార్డులతో మెంటల్ మాస్ అనిపించే సంచలనాలను సృష్టిస్తున్నాడు. మెర్సల్, సర్కార్, బిగిల్ ఇప్పుడు మాస్టర్ ఇలా రీసెంట్ మూవీస్ అన్నీ కూడా…

అల్టిమేట్ రికార్డులను నమోదు చేశాయి, ట్రైలర్ ల పరంగా బిగిల్ ట్రైలర్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో 2.3 మిలియన్స్ కి పైగా లైక్స్ తో చరిత్ర సృష్టించగా… టీసర్ ల పరంగా ఇప్పుడు ఇండియా లోనే టాప్ 3 టీసర్ లైక్స్ లో విజయ్ నటించిన మూడు సినిమాలు ఉండటం….

ఆ మూడు కూడా రీసెంట్ మూవీస్ అవ్వడం విశేషం అనే చెప్పాలి. మెర్సల్ సినిమా టీసర్ 1.21 మిలియన్ లైక్స్ తో ఇప్పుడు టాప్ 3 ప్లేస్ లో ఉండగా రెండో ప్లేస్ లో సర్కార్ టీసర్ 1.48 మిలియన్స్ లైక్స్ తో మొన్నటి దాకా టాప్ ప్లేస్ ని 2 ఏళ్ళు ఎంజాయ్ చేసింది అని చెప్పాలి.

ఇప్పుడు ఆ రికార్డ్ ను మొదటి రోజే బ్రేక్ చేసి కొత్త నంబర్ 1 గా విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ టీసర్ నిలవగా టీసర్ ల పరంగా మొదటి 2 మిలియన్స్ లైక్స్ ని అందుకున్న టీసర్ గా కూడా రికార్డ్ సృష్టించి ఇప్పుడు 2.2 మిలియన్స్ వైపు దూసుకు పోతూ కొత్త బెంచ్ మార్క్ ని మరింత పెద్దదిగా చేస్తుంది అని చెప్పాలి.

మొన్నటి వరకు మూడో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ నిలవగా ఇప్పుడు 4 వ ప్లేస్ కి వచ్చింది. మొత్తం మీద టాప్ 3 మూడు ప్లేసులు విజయ్ పేరిటే ఉండగా అప్ కమింగ్ సౌత్ బిగ్ మూవీస్ లో ఏవి ఈ రికార్డును బ్రేక్ చేసి టాప్ 3 లో నిలుస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here