Home న్యూస్ అక్షరాలా 755 కోట్లు ఔట్….రెబల్ స్టార్ అరాచకం సామి ఇదీ!!

అక్షరాలా 755 కోట్లు ఔట్….రెబల్ స్టార్ అరాచకం సామి ఇదీ!!

1

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) రెండో వారంలో అడుగు పెట్టి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇక మొత్తం మీద 9 రోజులు పూర్తి అయ్యే టైంకి…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో 227 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంటే వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 720 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా. ఇక 10వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 7.5-8 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీలో సినిమా 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా ఇండియా లో…

   

సినిమా 10వ రోజున ఇప్పుడు 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో సైతం రెట్టించిన జోరు చూపిస్తున్న సినిమా 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 10వ రోజున 36 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. దాంతో ఈ రోజు కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో 234 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న సినిమా వరల్డ్ వైడ్ గా 750 కోట్ల మార్క్ ని దాటేసి…

755 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…మొత్తం మీద ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అరాచకమం సృష్టిస్తున్న కల్కి మూవీ ఆదివారం కూడా ఇప్పుడు రెట్టించిన జోరు చూపించవచ్చు. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here