యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రతీ రోజూ అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మాత్రం అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది అని చెప్పాలి.
ఇక 7 వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 వ రోజు తో పోల్చితే 7 వ రోజు ఓవరాల్ గా 30% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది, టికెట్ హైక్స్ ఇంపాక్ట్ ఇప్పుడు క్లియర్ గానే కనిపిస్తుంది అని చెప్పాలి.
అయినా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో బాగానే హోల్డ్ చేసిన సినిమా మొత్తం మీద ఇప్పుడు 6.5 కోట్ల రేంజ్ నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైక్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలు మించి పొతే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది…
ఇక హిందీ లో సినిమా మరో సారి స్ట్రాంగ్ హోల్డ్ ని సొంతం చేసుకున్న సినిమా 11 కోట్ల నుండి 11.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళనాడు అండ్ కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఓవరాల్ గా సినిమా ఇప్పుడు 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఓవర్సీస్ లో కూడా బాగానే హోల్డ్ చేసిన సినిమా ఇప్పుడు ఓవరాల్ గా 7 వ రోజు వరల్డ్ వైడ్ గా 17 కోట్ల నుండి 18 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 20 కోట్ల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి ఈ రోజు సినిమా అంచనాలను అందుకుంటుందా లేక కలెక్షన్స్ 6 వ రోజు లాగా తగ్గుతాయో చూడాలి ఇక…