బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ వర్కింగ్ డేస్ లో చాలా వరకు స్లో డౌన్ అయింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇక తేరుకునే అవకాశం అయితే చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. ఇక సినిమా 6వ రోజు 57 లక్షల షేర్ ని అందుకోగా ఇప్పుడు 7వ రోజు మరో వర్కింగ్ డే లో సినిమా మరోసారి…
ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. తమిళ్ వర్షన్ కూడా భారీగా స్లో డౌన్ అయింది… దాంతో ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇప్పుడు అటూ ఇటూగా 35 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి.
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 40 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది, ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 50 లక్షల నుండి 55 లక్షల లోపు షేర్ ని అందుకోవచ్చు. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇవి అస్సలు సరిపోవు. ఇక టోటల్ గా మొదటి వారానికి గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.