Home న్యూస్ కల్కి2898 AD…7th డే కలెక్షన్స్…మరోసారి మాస్ రచ్చ!

కల్కి2898 AD…7th డే కలెక్షన్స్…మరోసారి మాస్ రచ్చ!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మొదటి వారాన్ని ఇప్పుడు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా…

అన్ని చోట్లా కూడా మరోసారి సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో మరోసారి సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ఉండగా ఆంధ్ర సీడెడ్ ల కన్నా మరోసారి బెటర్ గా ట్రెండ్ అవుతుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు…

5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో మరోసారి మంచి జోరుని చూపిస్తున్న సినిమా 10-11 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి 2.25 కోట్ల రేంజ్ నుండి 2.5 కోట్ల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపిస్తున్న సినిమా 3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది… అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…

ఓవరాల్ గా 7వ రోజు షేర్ లెక్క పెరగవచ్చు…మొత్తం మీద 7వ రోజు వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ ఇప్పుడు 16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా మొదటి వారానికి గాను సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here