నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 6వ రోజు అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోగా 7వ రోజు మరోసారి మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయిన సినిమా డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో మొత్తం మీద…
మంచి హోల్డ్ ని చూపిస్తూ పరుగును కొనసాగిస్తుంది. నైజాంలో డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉండగా మిగిలిన ఏరియాలలో మాత్రం సినిమా మంచి హోల్డ్ ని చూపిస్తుంది. ఓవరాల్ గా డే 6 తో పోల్చితే డే 7 డ్రాప్స్ 35% రేంజ్ లో ఉండగా ఇప్పుడు సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 2.8 కోట్ల రేంజ్ నుండి 3 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 3 కోట్ల నుండి 3.2 కోట్ల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా ఇప్పుడు…
3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. సినిమా 4-5 రోజుల్లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మరి ఈ రోజు కూడా మరోసారి అంచనాలను మించుతుందా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.