బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు, సౌత్ లో జస్ట్ రీజనల్ మూవీస్ తోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే కెపాసిటీని సొంతం చేసుకుని తిరుగు లేని ఫామ్ లో దూసుకు పోతున్న విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie)…
సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కేవలం 2 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని కోలివుడ్ ఇండస్ట్రీ తరుపున ఫాస్టెస్ట్ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి…
కాగా సినిమా 2 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని దాటేయగా విజయ్ కెరీర్ లో ఈ సినిమాతో కలిపి ఏకంగా 7 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద మరే హీరో సాధించని రికార్డ్ నంబర్ ఆఫ్ 200 కోట్ల మూవీస్ తో దూసుకు పోతున్నాడు విజయ్…
విజయ్ కెరీర్ లో ఇది వరకు మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్ మరియు వారిసు సినిమాలు ఈ మార్క్ ని దాటగా ఇప్పుడు 7వ సినిమాగా లియో సినిమా నిలిచి సంచలనం సృష్టించింది. సౌత్ లో ఇలా 7 సినిమాలతో దుమ్ము లేపిన హీరో విజయ్ కాగా 6 సినిమాలతో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) రెండో ప్లేస్ లో ఉన్నాడు…
ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే…టోటల్ గా 7 సినిమాలు అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వరుసగా రిలీజ్ అయ్యి ఈ మార్క్ ని అందుకోవడం అన్నది మామూలు విషయం కాదు, ఈ రికార్డ్ తో ప్రజెంట్ సౌత్ లోనే విజయ్ బెస్ట్ ఫామ్ లో ఉన్న హీరోగా దూసుకు పోతున్నాడు అని చెప్పొచ్చు, ఇక లియో లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.