Home న్యూస్ అక్షరాలా 815 కోట్లు….చరిత్రకెక్కిన భీభత్సం ఇది!

అక్షరాలా 815 కోట్లు….చరిత్రకెక్కిన భీభత్సం ఇది!

0
Kalki 2898 AD Movie 11 Days Total World Wide Gross Collections
Kalki 2898 AD Movie 11 Days Total World Wide Gross Collections

రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 236 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 768 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది…

ఇక సినిమా 11వ రోజున సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేసింది, నైట్ షోలకు కొంచం డ్రాప్స్ అక్కడక్కడా కనిపించినా కూడా ఓవరాల్ గా రోజుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

11వ రోజున ఇప్పుడు 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీఓ దుమ్ము లేపే రేంజ్ లో కుమ్మేస్తున్న సినిమా హిందీ నుండే ఈ రోజున 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది…. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో…

మరోసారి ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ 9-10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ గా ఇండియాలో సినిమా 11వ రోజున ఇప్పుడు 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో మరోసారి సినిమా ఇప్పుడు…

5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండటంతో వరల్డ్ వైడ్ గా 11 వ రోజున కల్కి మూవీ 45-46 కోట్ల లోపు గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు 10వ రోజు మాదిరిగా అంచనాలను మించితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉండగా…

మొత్తం మీద 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 244 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉన్న సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అక్షరాలా 815 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ తో సంచలనం సృష్టించబోతుంది. సైన్స్ ఫిక్షన్ జానర్ కి ఈ రేంజ్ లో గ్రాస్ అంటే మామూలు ఊచకోత కాదు. ఇక టోటల్ గా 11 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here