మొత్తం మీద మొదటి వారాన్ని ఓవరాల్ గా చూసుకుంటే మంచి కలెక్షన్స్ తోనే ముగించింది లవ్ స్టొరీ సినిమా, తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో వర్షాల ఎఫెక్ట్ వలన సినిమా మూమెంట్ ని కోల్పోయినా కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని మొదటి వారం లో సెకెండ్ వేవ్ తర్వాత సొంతం చేసుకున్న సినిమా గా నిలిచిన లవ్ స్టొరీ…
రెండో వారాన్ని మొదలు పెట్టగా పోటి లో రిపబ్లిక్ ఉన్నా కానీ బాగానే థియేటర్స్ ని హోల్డ్ చేసింది, కానీ ఈ రోజు కూడా వర్కింగ్ డే నే కాబట్టి ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంటిన్యూ అవ్వగా 7 వ రోజు తో పోల్చితే 8 వ రోజు డ్రాప్స్ ఆల్ మోస్ట్ 30% రేంజ్ లో…
కనిపించాయి బాక్స్ ఆఫీస్ దగ్గర… ఈ లెక్కన ఇప్పుడు సినిమా 8 వ రోజు 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 30 లక్షల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శని, ఆదివారాల్లో సాలిడ్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్రేక్ ఈవెన్ కోసం…