ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా సినిమాలు ఎక్కువగానే టెలికాస్ట్ అవ్వగా కొత్త సినిమాలు పాత సినిమాలు అన్నీ కూడా మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాయి. ముందుగా బిగ్ బాస్ 8 వ వారం సాధించిన రేటింగ్స్ ని గమనిస్తే, శనివారం ఎపిసోడ్ కి 5.1 రేటింగ్ దక్కగా ఆదివారం సమంత హోస్ట్ చేసిన ఎపిసోడ్ కి 11.3 రేటింగ్ దక్కి మంచి ఇంప్రూవ్ మెంట్ ని చూపించ గా…
మొత్తం మీద వర్కింగ్ డేస్ లో యావరేజ్ గా 4.72 రేటింగ్ ని సొంతం చేసుకుంది, సండే ఎపిసోడ్ మినహా ఓవరాల్ గా మరోసారి వీక్ రేటింగ్ లనే సొంతం చేసుకుంది బిగ్ బాస్ సీజన్ 4… ఇక IPL తెలుగు ఛానెల్ మరోసారి స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 19.6 రేటింగ్ ని అందుకుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే నితిన్ భీష్మ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయినా టెలివిజన్ లో మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది, ఇక ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన డబ్బింగ్ మూవీ సైకో మెప్పించగా కోటికొక్కడు మెప్పించ లేక పోయింది. ఇక ఓల్డ్ మూవీస్…
అన్నమయ్య, సంక్రాంతి ఇప్పటికీ మెప్పిస్తూ ఉండగా లెజెండ్, బిల్లా లాంటి మూవీస్ కూడా లిస్టులో నిలవడం విశేషం, ఒకసారి అక్టోబర్ 19 నుండి 26 వరకు టెలికాస్ట్ అయిన సినిమాల రేటింగ్ లను ఒకసారి గమనిస్తే
👉#Bheeshma – 6.65
👉#Psycho 1st time – 5.89
👉#Annamayya – 3.18
👉#Sankranthi – 3.11
👉#Legend – 2.48
👉#Billa – 2.14
👉#Pantham – 2.11
👉#Kotikokkadu 1st time- 1.83
ఇవి మొత్తం మీద టాప్ రేటింగ్ లను అందుకున్న తెలుగు సినిమాలు.
ఇక కొన్ని సినిమాలు కన్నడ లో డబ్ అయ్యి టెలికాస్ట్ అవ్వగా అల వైకుంఠ పురం లో కన్నడ డబ్బింగ్ 5.34 రేటింగ్ ని సొంతం చేసుకోగా, అల్లు అర్జున్ నటించిన మరో మూవీ దువ్వాడ జగన్నాథం కి 2.23 రేటింగ్ దక్కింది, ఇక ప్రభాస్ సాహో సినిమాకి 2.12 రేటింగ్ దక్కాయి. ఇక లాస్ట్ వీక్ మూవీస్ రేటింగ్స్ రిపోర్ట్ ఈ గురువారం రిలీజ్ అవుతుంది.