ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని వరల్డ్ వైడ్ గా ఊహకందని బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ కంప్లీట్ చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) రెండో వారంలో అడుగు పెట్టగా, మరోసారి వర్కింగ్ డేస్ లో సినిమా మంచి జోరుని చూపెడుతుంది…
సినిమా 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి హోల్డ్ ని చూపెడుతూ ఓవరాల్ గా డ్రాప్స్ లిమిటెడ్ గానే సొంతం చేసుకుంటూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది..
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరగవచ్చు…ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి సినిమా మరోసారి 2.5-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీలో మరోసారి ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా అక్కడ 25 కోట్లకు రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…
అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ ఓ కూడా సినిమా ఉన్నంతలో మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో ఇప్పుడు 8వ రోజున వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది, సినిమా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తోనే రన్ ను కొనసాగిస్తూ ఉండటంతో రెండో వీకెండ్ లో తిరిగి ఓ రేంజ్ లో కుమ్మేసే అవకాశం ఉంది. ఇక సినిమా 8 రోజుల టోటల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.