బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో రిమార్కబుల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా రెండో వీక్ లో అడుగు పెట్టగా సినిమా వాలెంటైన్ వీకెండ్ లో ఇతర సినిమాలను డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ ట్రెండ్ చూపెడుతూ దుమ్ము లేపుతుంది ఈ రోజున…
ఆల్ మోస్ట్ 7వ రోజు మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ టు గుడ్ గ్రోత్ ని కొత్త అండ్ రీ రిలీజ్ లు ఉన్నా కూడా జోరు చూపెడుతూ ఉండటంతో ఆఫ్ లైన్ లో కూడా టికెట్ సేల్స్ పరంగా మంచి జోరు ని చూపెడుతున్న తండేల్ మూవీ ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ జోరు ని బట్టి చూస్తుంటే…
8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 1.7-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2-2.1 కోట్ల రేంజ్ లో షేర్ ని..
సొంతం చేసుకునే అవకాశం ఉండగా, నైట్ షోలకు ట్రెండ్ అంచనాలను మించిపోతే ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 3.5-3.7 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది…
మొత్తం మీద రెండో వీక్ ని స్ట్రాంగ్ కలెక్షన్స్ తో స్టార్ట్ చేయబోతున్న తండేల్ మూవీ శని ఆది వారాలలో ఇక రెట్టించిన జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తండేల్ మూవీ టోటల్ గా 8 రోజులకు గాను సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.