Home న్యూస్ 8వ రోజు టాప్ 3 లో కల్కి….ఈ ఊపు ఇప్పట్లో ఆగేలా లేదు!

8వ రోజు టాప్ 3 లో కల్కి….ఈ ఊపు ఇప్పట్లో ఆగేలా లేదు!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి2898AD(Kalki2898AD Movie) రెండో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ అండ్ కాలేజ్ లు బంద్ అడ్వాంటేజ్ వలన సినిమా…

అనుకున్న రేంజ్ కి మించి జోరు చూపించింది…6 కోట్లు ఆ పైన వసూళ్లు అందుకునే అవకాశం ఉందని అనుకున్నా సినిమా అంచనాలను మించి పోయి ఏకంగా 7.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది… అన్ని చోట్లా రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా…

8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో టాప్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల పరంగా ఏకంగా టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది…RRR మూవీ టాప్ లో కొనసాగుతూ ఉండగా తర్వాత రీజనల్ మూవీ అల వైకుంఠ పురంలో ఉండగా మూడో ప్లేస్ లో ఇప్పుడు కల్కి నిలిచింది…

ఒకసారి 8వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
👉#RRRMovie – 8.33Cr
👉#AlaVaikunthapurramuloo- 7.92Cr
👉#KALKI2898AD- 7.52Cr********
👉#SarileruNeekevvaru– 6.60Cr
👉#Baahubali2 -6.58Cr
👉#Syeraa-5.91Cr
👉#HanuMan: 4.75Cr
👉#F2: 4.38Cr
👉#Baahubali2 -3.88Cr
👉#WaltairVeerayya : 3.85CR
👉#GeethaGovindam – 3.25Cr
👉#KhaidiNo150: 2.97Cr
👉#AravindhaSametha : 2.80cr

మొత్తం మీద కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటంతో ఈ ఊపు ఇప్పట్లో ఆగే అవకాశం తక్కువే అని చెప్పాలి. నార్మల్ వర్కింగ్ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here