బాక్స్ ఆఫీస్ దగ్గర బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వీకెండ్ హాలిడేస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది కానీ తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో జోరు ఇంకా పెంచాల్సిన అవసరం బ్రేక్ ఈవెన్ కోసం ఎంతైనా ఉండగా సెకెండ్ వీకెండ్ ని మొదలు పెట్టిన బంగార్రాజు సినిమా 8 వ రోజు తో పోల్చితే….
ఇప్పుడు 9 వ రోజు ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు 46 లక్షల షేర్ ని సొంతం చేసుకుంటే 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 55 లక్షల నుండి 60 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని…
అంచనా వేయగా సినిమా కొంచం అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర 9 వ రోజు మొత్తం మీద 64 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా టోటల్ గా 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 7.78Cr
👉Ceeded: 6.14Cr
👉UA: 4.59Cr
👉East: 3.70Cr
👉West: 2.63Cr
👉Guntur: 3.13Cr
👉Krishna: 2.02Cr
👉Nellore: 1.59Cr
AP-TG Total:- 31.58CR(51.02Cr~ Gross)
👉Ka+ROI: 1.65Cr
👉OS – 1.40Cr
Total WW: 34.63CR(58CR~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…. సినిమాను…
మొత్తం మీద 38.15 కోట్లకు అమ్మగా 39 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 4.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మిగిలిన రోజుల్లో ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.