100 కోట్ల గ్రాస్ మార్క్ ఒకప్పుడు అతి పెద్ద టార్గెట్ గా ఉండేది అందరికీ కూడా, కానీ మార్కెట్ ఎక్స్ పాన్షన్ అవుతున్న కొద్ది టికెట్ రేట్ల పెంపు, భారీ రిలీజ్ లు, హైప్ లు లాంటివి హెల్ప్ అయ్యి ఈజీగా 100 కోట్ల మార్క్ ని అందుకోవడానికి వీలు కుదురుతూ వస్తుండగా 100 కోట్లు అవలీలగా బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు అవుతూ వస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ…
అన్నట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమాకి వచ్చిన టాక్ కి ఈ రేంజ్ భీభత్సం ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో 100 కోట్ల మార్క్ ని అందుకున్న రజినీ…
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక సార్లు 100 కోట్ల మార్క్ ని అందుకున్న హీరోగా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేశాడు ఇప్పుడు. తన కెరీర్ లో మొత్తంగా 9 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాయి. సౌత్ లో ఈ రికార్డ్ మరే హీరోకి లేదంటే….
ఏ రేంజ్ లో డామినేట్ చేశాడో అర్ధం చేసుకోవచ్చు… మొదటి సారి శివాజీ సినిమా తో 100 కోట్ల మార్క్ ని అందుకుని రికార్డ్ కొట్టిన రజినీ తర్వాత రోబో, లింగా, కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్ మరియు ఇప్పుడు అన్నాట్టే సినిమాలతో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని 9 సినిమాలతో టాప్ లో ఉండగా తర్వాత విజయ్ ఆల్ మోస్ట్ 7 సినిమాలతో…
టాప్ 2 లో నిలిచాడు…. ఇక్కడ రజినీ స్పెషాలిటీ ఏంటంటే వరుసగా చేసిన సినిమాలు అన్నీ కూడా 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయి, మధ్యలో యానిమేషన్ మూవీ కొచ్చాడియాన్ సినిమాను తీసేస్తే లాస్ట్ 9 సినిమాలు 100 కోట్ల మార్క్ ని అందుకోవడం సౌత్ ఇండస్ట్రీలో ఒక్క సూపర్ స్టార్ రజినీకే చెల్లింది అని చెప్పాలి…