బాక్ టు బాక్ రెండు డిసాస్టర్ మూవీస్ తర్వాత యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాతో రిమార్కబుల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా 10 రోజులు నాన్ స్టాప్ 1 కోటి కి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయగా…
అన్ సీజన్ ఇంపాక్ట్ వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ నుండి కొంచం ఎక్కువ స్లో అయినా కూడా ఓవరాల్ గా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ ఉన్న ఈ సినిమా ఆల్ రెడీ కొత్త బెంచ్ మార్క్ లను నమోదు చేస్తున్న తండేల్ మూవీ…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో బెంచ్ మార్క్ ని నమోదు చేసింది. ఏకంగా సినిమా 90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ భీభత్సం సృష్టించింది. 15 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 89 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకున్న తండేల్ మూవీ ఇప్పుడు 16వ రోజున..
సాధించిన కలెక్షన్స్ తో 90 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించి మాస్ కుమ్ముడు కుమ్మేసింది…. మేకర్స్ లెక్కల్లో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటింది అని పబ్లిసిటీ పోస్టర్ రిలీజ్ చేసినా కూడా ఓవరాల్ గా సినిమా ట్రేడ్ లెక్కల్లో ఇప్పుడు 16 రోజుల్లో…
90 కోట్ల మార్క్ ని గ్రాస్ చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా 69 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ లాభాలను ఇక్కడ కూడా సొంతం చేసుకుంటూ ఉండగా లాంగ్ రన్ లో సినిమా ట్రేడ్ లెక్కలలో 100 కోట్ల మార్క్ ని అందుకోవడం కష్టం అయినా 95 కోట్లకు చేరువ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.