యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో సమ్మర్ లో బిగ్గెస్ట్ సోలో రిలీజ్ గా పరశురాం డైరెక్షన్ లో చేసిన తన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(Family Star Movie) సినిమా రిలీజ్ అయ్యి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా….
ఏ దశలో కూడా సినిమా బడ్జెట్ కి బిజినెస్ కి న్యాయం అయితే చేయలేక పోయింది. సినిమాను మొత్తం మీద 90 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కించగా…. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందుకోలేక పోయిన సినిమా వాల్యూ బిజినెస్ 44 కోట్ల మార్క్ కి చాలా దూరంగా ఆగిపోయింది సినిమా….
ఓపెనింగ్స్ పరంగా కూడా రీసెంట్ టైంలో విజయ్ దేవరకొండ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ తర్వాత కొన్ని హాలిడేస్ అడ్వాంటేజ్ లు లభించినా కూడా ఏమాత్రం గ్రోత్ ని చూపించ లేదు. దాంతో టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే……
The Family Star Total World Wide Collections Report(inc GST)
👉Nizam: 5.10Cr
👉Ceeded: 1.01Cr
👉UA: 1.15Cr
👉East: 74L
👉West: 61L
👉Guntur: 76L
👉Krishna: 70L
👉Nellore: 58L
AP-TG Total:- 10.65CR (19.30CR~ Gross)
👉KA+ROI: 1.50Cr
👉OS: 4.95Cr
Total WW:- 17.10CR (33.00CR~ Gross)
మొత్తం మీద 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా 26.90 కోట్ల షేర్ దూరంలో ఆగిపోయి డబుల్ డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది….చాలా టైంగా కంబ్యాక్ కోసం ఎదురు చూసిన విజయ్ దేవరకొండకి మరో నిరాశ కలిగించే రిజల్ట్ ను సినిమా సొంతం చేసుకుంది. తన అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…