Home టోటల్ కలెక్షన్స్ మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు టోటల్ కలెక్షన్స్…సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!

మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు టోటల్ కలెక్షన్స్…సెన్సేషనల్ బ్లాక్ బస్టర్!

0

మలయాళంలో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఇండస్ట్రీ హిట్ మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Telugu Total Collections) సినిమా తెలుగులో రీసెంట్ గా డబ్ అవ్వగా సమ్మర్ లో హిట్ అయిన ఒకే ఒక్క సినిమాగా నిలిచింది….తెలుగు లో స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత సాలిడ్ లాంగ్ రన్ ను…

దక్కించుకున్న సినిమా ఓవరాల్ గా తెలుగులో రిలీజ్ అయిన మలయాళ సినిమాలలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…14 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకున్న సినిమా హిస్టారికల్ రికార్డులను నమోదు చేయడం విశేషం…

మొత్తం మీద సినిమా తెలుగులో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Manjummel Boys Telugu States Total Collections Report
👉Nizam: 3.80Cr~
👉Total AP: 3.45Cr~
Total AP-TG Collections:- 7.25CR(14.40CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగులో 3 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 4.25 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…ఈ సినిమా కన్నా ముందు ప్రేమలు మూవీ తెలుగులో రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంటే ఆ కలెక్షన్స్ ని మంజుమ్మేల్ బాయ్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here