Home న్యూస్ “90ML” రివ్యూ…. ప్లస్ & మైనస్ పాయింట్స్!!

“90ML” రివ్యూ…. ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

      తొలి సినిమా RX100 తో టాలీవుడ్ లో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చినా తర్వాత హిప్పీ గుణ 369 సినిమాలతో అంచనాలను అందుకోలేక పోయిన కార్తికేయ మధ్యలో గ్యాంగ్ లీడర్ లో విలన్ రోల్ చేసినా అది తనకి పెద్దగా బూస్ట్ ఇవ్వలేదు. ఇలాంటి టైం లో “90ML” అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. మరి వరుస పరజాయలతో ఉన్న కార్తికేయ కి ఈ సినిమా ఎంతవరకు ఊపిరి పోసిందో లేదో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే పుట్టడమే ‘ఫెటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ డిజార్డర్’తో పుట్టిన హీరో తను బతకాలంటే రోజు ఆల్కహాల్ తీసుకోవాలి. ఆ అలవాటు వల్ల జాబ్స్ దొరక్క పోవడంతో వైన్ షాప్ లో పనిచేస్తాడు, అనుకోకుండా హీరోయిన్ తో పరిచయం ఏర్పడగా… తనకి తన ఫ్యామిలీ కి ఈ తాగుడు అంటే అస్సలు పడదు.

మరి హీరో ఎలా మ్యానేజ్ చేసి ప్రేమించాడు, ఈ నిజం తెలిసిన తర్వాత హీరోయిన్ రియాక్షన్ అండ్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి…వాళ్ళు ఎలా కలిశారు అన్నది ఓవరాల్ గా సినిమా కథ. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తికేయ తన వరకు ఉన్నంతలో ఆకట్టుకున్నాడు.

డైలాగ్స్, యాక్షన్, డాన్స్, పెర్ఫార్మెన్స్ విషయం లో మునుపటి మూవీస్ కన్నా బెటర్ మెంట్ ఉంది. ఇక హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించుకోగా మిగిలిన నటీనటులు తమ పరిది మేర నటించారు. సంగీతమ్ రెండు మూడు పాటలు ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు చాలా సీన్స్ లో ఆకట్టుకోగా సెకెండ్ ఆఫ్ లో వాళ్ళ కి ఎడిట్ చేయడానికి చాలా సీన్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎడిట్ చేయలేదు. ఇక సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే చాలా సింపుల్ స్టొరీ ని…

ఏకంగా 2 గంటల 40 నిమిషాల లెంత్ తో తెరకెక్కించాడు డైరెక్టర్. ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ ఎలాగోలా కొంచం ఆకట్టుకున్న సినిమా సెకెండ్ ఆఫ్ టోటల్ గా ఒకే లైన్ పై వెళుతుంది, హీరో హీరోయిన్ ని ఒప్పించాలని చూడటం తను బ్రేక్ అప్ చెప్పడం, బ్రేక్ అప్ సాంగ్ రావడం టోటల్ ఇలానే సాగుతుంది సినిమా.

సినిమా ఎంత ఆసక్తిగా మొదలు అవుతుందో హీరోయిన్ ఎంట్రీ తర్వాత హీరో తన నిజం దాయడం నుండి అంత రొటీన్ గా మారి చివరికి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేలా చేస్తుంది. డైరెక్టర్ కథ పాయింట్ ని సెకెండ్ ఆఫ్ నరేషన్ ని మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటె బాగుండేది.

ఉన్నంతలో ఎదో ఫస్టాఫ్ వరకు కొంచం ఎంజాయ్ చేసి సెకెండ్ ఆఫ్ నిద్రపోయి వచ్చే టైప్ మూవీస్ లో ఈ సినిమా ఒకటి. సినిమా మా ఫైనల్ రేటింగ్ [2.5 స్టార్స్].. రొటీన్ మూవీస్ చూసే వాళ్ళు కూడా ఈ సినిమా విషయం లో వెనుకంజ వేసేలా ఉంది 90ML సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here