బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 52.25 కోట్ల గ్రాస్ మార్క్ తో మాస్ రచ్చ చేసింది…వరల్డ్ వైడ్ గా సినిమా 71.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
ఇప్పుడు మూడో రోజు సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ తో మాస్ తాండవం ఆడింది…కొన్ని థియేటర్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళినా కూడా డాకు మహారాజ్ ఉన్న థియేటర్స్ లోనే ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో వీర లెవల్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండగా….
ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి ఆల్ మోస్ట్ రెండో రోజుకి ఈక్వల్ అనిపించే రేంజ్ లో 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా..
1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఓవర్సీస్ లో మరోసారి కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉండటం తో ఓవరాల్ గా 3వ రోజున వరల్డ్ వైడ్ గా 18-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది డాకు మహారాజ్ సినిమా కి ఇప్పుడు…
ఓవరాల్ గా ఈ రోజు కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 67 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటి ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే 92 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతున్న సినిమా లాంగ్ వీక్ మొత్తం ఇదే రేంజ్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో బ్రేక్ ఈవెన్ ని త్వరగానే అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు.