ఓడలు బండ్లు…బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో… ఒకప్పుడు ఒక్క ఏడాదిలో ఏకంగా 980 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న హీరో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు సరికదా బాక్స్ ఆఫీస్ దగ్గర కనీస కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకోలేక పోతూ వరుస ఫ్లాఫ్స్ తో కెరీర్ లో లో స్టేజ్ కి వచ్చేశాడు. ఆ హీరోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.
ప్రీ కోవిడ్ అంటే 2019 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు అద్బుతాలు సృష్టించాయి… కేసరి సినిమా 155.7 కోట్లు మిషిన్ మంగల్ 203.8 కోట్లు హౌస్ ఫుల్ 4 210.25 కోట్లు అందుకోగా.. ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది.
మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది, అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ లో ఉండగా కోవిడ్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు మరియు ఇప్పుడు సేల్ఫీ సినిమాలు…
థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇందులో సూర్యవంశీ ఒక్కటి డైరెక్టర్ అండ్ హీరో క్రేజ్ వలన హిట్ అయితే మిగిలిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వగా ఇక డిజిటల్ లో, లక్ష్మీ, అతరింగి రే, కట్ పుట్లీ సినిమాలు రిలీజ్ అయ్యి నిరాశ పరిచాయి. ప్రీ కోవిడ్ లో కెరీర్ ఆల్ టైం పీక్ స్టేజ్ లో ఉన్న హీరో ఇప్పుడు ఆల్ టైం లో స్టేజ్ కి వచ్చాడు.