మొదటి వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ తో పాటు లాభాలను సొంతం చేసుకున్న బింబిసార మరియు సీతా రామం సినిమాలు రెండో వారంలో అడుగు పెట్టగా 8వ రోజు బింబిసార సినిమా ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించగా సీతా రామం సినిమా డీసెంట్ హోల్డ్ ని చూపించింది. ఇక 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి కలెక్షన్స్ తో..
ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నాయి. బింబిసార సినిమా 9వ రోజు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 8వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు…
బాగుంటే 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సీతా రామం సినిమా కూడా తెలుగు రాష్ట్రాలలో మరోసారి 8వ రోజు లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆల్ మోస్ట్ సినిమా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక సీతా రామం సినిమా వరల్డ్ వైడ్ గా 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బింబిసార సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి…
ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఆల్ రెడీ అద్బుతమైన లాభాలతో దూసుకు పోతున్న ఈ రెండు సినిమాలు ఈ వీకెండ్ లో మరోసారి సాలిడ్ కలెక్షన్స్ తో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 2 సినిమాల 9వ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.