బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ మొదటి వారాన్ని ఘనంగా పూర్తీ చేసుకుంది, వర్కింగ్ డేస్ కొంచం దెబ్బ కొట్టినా ఓవరాల్ గా సెకెండ్ వేవ్ తర్వాత ది బెస్ట్ ఓపెనర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు రెండో వారం మొదటి రోజు కూడా మంచి ట్రెండ్ ను సాధించగా ఇప్పుడు 9 వ రోజున గాంధీ జయంతి హాలిడే అడ్వాంటేజ్ ను…
ఎక్స్ లెంట్ గా వాడుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది, సినిమా 8 వ రోజు కన్నా కూడా 20% గ్రోత్ తో రోజును సాలిడ్ గానే మొదలు పెట్టగా ఈవినింగ్ షోలకు వచ్చేసరికి ఆ గ్రోత్ ని పెంచుకుంటూ పోయిన సినిమా ఆల్ మోస్ట్ 40%కి పైగా…
గ్రోత్ ని ఓవరాల్ గా సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఎక్స్ లెంట్ అనిపించే విధంగా కొనసాగాయి. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజున 70 నుండి 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని, కంప్లీట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క 1 కోటి రేంజ్ కి వెళ్ళే అవకాశం మించే అవుట్ రైట్ ఛాన్స్ కూడా పుష్కలంగా ఉందని చెప్పాలి.