ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 8 రోజుల్లో లాభాల్లో దుమ్ము లేపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రెండో వారంలో జోరు చూపించబోతూ ఉండగా 8వ రోజు సినిమా మంచి హోల్డ్ ని చూపించిన తర్వాత ఇప్పుడు వీకెండ్ అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం…
సినిమా 8వ రోజు తో పోల్చితే 9వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఆల్ మోస్ట్ 50-60% రేంజ్ లో గ్రోత్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం, కాగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇదే ట్రెండ్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో…
కలెక్షన్స్ పరంగా మంచి గ్రోత్ కనిపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా ఈ రోజు 3.6-3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే…
ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది, కొన్ని చోట్ల టికెట్ హైక్స్ ని తగ్గించడంతో కలెక్షన్స్ లో కొంచం మార్పులు అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక హిందీలో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…
కర్ణాటకలో మరియు ఓవర్సీస్ లో హోల్డ్ బాగానే చేస్తున్న సినిమా మిగిలిన చోట్ల కంప్లీట్ గా స్లో అయింది. ఓవరాల్ గా 9వ రోజు వరల్డ్ వైడ్ గా 6.3-6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా ఇంకా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.
Swag collection please