మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ధమాకా రెండో వీకెండ్ లో అడుగు పెట్టి సినిమా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి జోరు చూపించింది. సినిమా ఇక 9వ రోజు లో అడుగు పెట్టిన సినిమా కొత్త సినిమాల నుండి పోటి ఏమి లేక పోయినా కానీ పవన్ కళ్యాణ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా రీ రిలీజ్ ఇంపాక్ట్ వలన ధమాకా సినిమా…
కలెక్షన్స్ పై ఎఫెక్ట్ అయితే పడింది అని చెప్పాలి. తిరిగి ఈవినింగ్ షోల నుండి సినిమా ఎక్స్ లెంట్ గా జోరు ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం. ఇప్పుడు ఓవరాల్ గా 8వ రోజు తో పోల్చితే 9వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద….
1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, నైట్ షోలు ఇంకా జోరు చూపిస్తే కలెక్షన్స్ ఆల్ మోస్ట్ 8వ రోజుకి దగ్గర అయ్యే అవకాశం ఉంది.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమమ్ అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 9 రోజులకు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.