బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD Movie) రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ కాలేజ్ లు బంద్ ఉండటంతో మంచి జోరునే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి…
ఇప్పుడు అంచనాలను మించే కలెక్షన్స్ ని 8వ రోజు సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు 9వ రోజు నార్మల్ శుక్రవారంలో అడుగు పెట్టగా నార్మల్ డే అవ్వడంతో కొంచం డ్రాప్స్ కనిపిస్తూ ఉన్నా కూడా ఉన్నంతలో సినిమా 7వ రోజు లెవల్ లో పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పాలి ఇప్పుడు.
ఈవినింగ్ అండ్ నైట్ షోలకి సినిమా ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపిస్తే మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మంచి జోరుని చూపిస్తూ ఉండగా…..
మరోసారి 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ లాంటి ఏరియాల్లో 1.5-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా మరోసారి మంచి జోరునే చూపిస్తూ ఉండటంతో మొత్తం మీద…
సినిమా అన్ని చోట్లా సేం ట్రెండ్ ను చూపిస్తే 9వ రోజు ఇప్పుడు 14-15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది. నైట్ షోలకు గ్రోత్ ని చూపిస్తే సినిమా ఓవరాల్ గా మరింత జోరు చూపించే అవకాశం ఉంటుంది. ఇక డే 9 ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…