బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ ను రీసెంట్ గా చేసిన జైలర్(Jailer Movie) తో సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని అందరి అంచనాలను మించి పోయి…
ఏకంగా 600 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా ఈ సినిమా విజయాన్ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న రజినీకాంత్ ఇప్పుడు ఈ సినిమాను మించే ఊచకోత కోసే సినిమాను కన్ఫాం చేశాడు. కోలివుడ్ లో ప్రజెంట్ అందరూ వర్క్ చేయాలి అనుకునే….
డైరక్టర్ అయిన లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ప్రస్తుతం దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లియో(LEO Movie) ని త్వరలో రిలీజ్ చేయబోతుండగా ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా ఎవరితో ఉంటుంది అన్నది ఆసక్తిగా మారగా… ఇప్పుడు…
సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ మూవీ ని అఫీషియల్ గా సన్ పిక్చర్స్ వాళ్ళు కన్ఫాం చేశారు…. ప్రస్తుతం రజినీ జైలర్ తో రిమార్కబుల్ ఇండస్ట్రీ హిట్ కంబ్యాక్ ఇవ్వడం డైరెక్టర్ అపజయం లేకుండా కెరీర్ లో దూసుకు పోతూ ఉండటంతో…
వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ అన్ని ఇండస్ట్రీలు షేక్ అయ్యే రేంజ్ లో ఉండటం ఖాయమని చెప్పొచ్చు… సినిమా ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా రికార్డుల ఊచకోత ఖాయం… మినిమం 700 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా వచ్చే దీపావళికి రిలీజ్ అవుతుందని అంటున్నారు…