Home న్యూస్ పెద్దకాపు1 ట్రైలర్ రివ్యూ…అడ్డాల నుండి ఇది ఊహించలేదు!!

పెద్దకాపు1 ట్రైలర్ రివ్యూ…అడ్డాల నుండి ఇది ఊహించలేదు!!

0

టాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala)..ఒక్క నారప్ప రీమేక్ తప్పితే కెరీర్ లో చేసిన అన్ని సినిమాలు కూడా చాలా వరకు క్లాస్ కంటెంట్ తోనే తెరకెక్కగా…. బ్రహ్మోత్సవం డిసాస్టర్ తర్వాత నారప్పతో రచ్చ చేస్తాడు అనుకున్నా…

ఆ సినిమా డిజిటల్ లోనే రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమాతో అడ్డాల కంబ్యాక్ ఇస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఎవ్వరూ ఊహినని రూరల్ రస్టిక్ మాస్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు పెద్దకాపు-1(PeddhaKapu1) సినిమా ఆడియన్స్ ముందుకు…

ఈ నెల చివర్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ రేంజ్ మాస్ కంటెంట్ అడ్డాల నుండి అయితే ఎవ్వరూ ఊహించలేదు అనే చెప్పాలి… 

కాస్ట్ గొడవల నేపధ్యంతో పల్లెటూరి బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కూడా కీలక రోల్ చేస్తూ ఉండగా టేకింగ్ విజువల్స్, అండ్ రస్టిక్ మూమెంట్స్ తో ట్రైలర్ మెప్పిచింది. కొత్త వాళ్ళే నటించిన కొందరు పేరున్న యాక్టర్స్ ముఖ్య రోల్స్ చేయడంతో… 

ఓవరాల్ గా స్టార్ కాస్ట్ మాత్రం బాగుంది అనిచెప్పాలి. ఇక స్టోరీ కూడా కొంచం రొటీన్ అనిపించినా సినిమాలో సీన్స్ వైజ్ మెప్పించే అవకాశం ఉండనిపించేలా ఉంది. ఇక ఓవరాల్ ట్రైలర్ మాత్రం బాగానే ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ బాగుంటే జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here