Home గాసిప్స్ 50 కోట్ల సినిమా…టోటల్ ప్రాఫిట్ లాస్ రిపోర్ట్…నిర్మాతకి లాభమా నష్టమా!!

50 కోట్ల సినిమా…టోటల్ ప్రాఫిట్ లాస్ రిపోర్ట్…నిర్మాతకి లాభమా నష్టమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో పెద్దగా ఫామ్ లో లేని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ గాండీవ ధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా మీద రిలీజ్ కి ముందు నుండే పెద్దగా బజ్ లేదు, దాంతో మౌత్ టాక్ నే…

నమ్ముకుని రిలీజ్ అయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరచగా పెట్టిన బడ్జెట్ దృశ్యా భారీ లెవల్ లో సినిమా నిరాశ పరిచింది అని చెప్పొచ్చు. ఆల్ మోస్ట్ 50 కోట్ల దాకా బడ్జెట్ తో తెరకెక్కింది, సినిమా మొత్తం మీద పెట్టిన బడ్జెట్ మీద ఓవరాల్ బిజినెస్ ను చూసుకుంటే…

సినిమా మొత్తం మీద డిజిటల్ రైట్స్ కింద ఆల్ మోస్ట్ 10.50 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకుందట, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ తో కలిపి 14 కోట్ల రేంజ్ రేటు ను సొంతం చేసుకోగా మ్యూజిక్ అండ్ ఇతర రైట్స్ తో 2 కోట్ల దాకా రికవరీ అయ్యిందని అంటున్నారు….

ఇక టోటల్ గా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా 26.50 కోట్ల దాకా రికవరీ అవ్వగా సినిమా థియేట్రికల్ బిజినెస్ కొన్ని ఏరియాలలో జరగగా కొన్ని చోట్ల ఓన్ గా రిలీజ్ చేయగా ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 17 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ వాల్యూ బిజినెస్ అండ్ నాన్ థియేట్రికల్…

బిజినెస్ లెక్కలు కలిపి 43.5 కోట్ల దాకా ఉండగా సినిమా మేకర్స్ కి ఇక్కడే 6 కోట్లకు పైగా డెఫిసిట్ పడిందని అంటున్నారు…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన నష్టాలను కూడా కౌంట్ చూసుకుంటే బడ్జెట్ లో 20 కోట్లకు పైగానే నష్టం వచ్చిందని అంటున్నారు…. ఈ ఇంపాక్ట్ ను తట్టుకుని వరుణ్ తేజ్ అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here