బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి రీసెంట్ టైం లో ఫ్లాఫ్స్ పడగా ఎట్టకేలకు రీసెంట్ మూవీస్ వరుస పెట్టి విజయాలను నమోదు చేస్తూ ఉండగా కొందరు హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం…
ప్రీ కోవిడ్ టైంలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోల్లో ఒకరైన ఆయుష్మాన్ ఖురానా (ayushmann khurrana) కోవిడ్ టైం తర్వాత మాత్రం వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను ఫేస్ చేయాల్సి వచ్చింది… కోవిడ్ టైం స్టార్ట్ అయ్యే ముందు బాలా మూవీ…
ఆ తర్వాత శుభ్ మంగల్ జ్యాదా సావ్దాన్, గులాబో సితాబో(OTT రిలీజ్), చండీగఢ్ కరే ఆశిఖి, అనేక్, డాక్టర్ జి, మరియు ఎన్ యాక్షన్ హీరో అంటూ వరుస పెట్టి 7 సినిమాల్లో 6 సినిమాలు బాక్స్ అఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవ్వగా తన కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన….
డ్రీమ్ గర్ల్(Dream Girl) సినిమా సీక్వెల్ అయిన డ్రీమ్ గర్ల్2(Dream Girl2) సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా మరీ పార్ట్ 1 రేంజ్ టాక్ రాక పోయినా కూడా పార్ట్ 2 పర్వాలేదు అనిపించేలా ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటి లో మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ…
మూడు వారాల్లో ఆల్ మోస్ట్ 101 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా సినిమా ఓవరాల్ గా హీరో ఆయుష్మాన్ ఖురానా కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. పరుగు ఆల్ మోస్ట్ స్లో డౌన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా డీసెంట్ హిట్ గా నిలిచింది హీరో కెరీర్ లో…