Home న్యూస్ 6 వరుస హిట్స్ కొట్టిన హీరో…ఇప్పుడు 11 కోట్లతో మైండ్ బ్లాంక్!!

6 వరుస హిట్స్ కొట్టిన హీరో…ఇప్పుడు 11 కోట్లతో మైండ్ బ్లాంక్!!

0

అందరికీ అన్ని వేళల హిట్స్ పడటం కష్టమే… ఒకసారి మార్కెట్ వస్తే ఆ మార్కెట్ ని నిలుపుకునే సినిమాలు చేయాలి. కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. ప్రీ కోవిడ్ ముందు బాలీవుడ్ లో వరుస పెట్టి 6 హిట్స్ తో దుమ్ము లేపిన ఈ హీరో సినిమా వస్తుంది అంటే…

ఆడియన్స్ లో మినిమమ్ గ్యారెంటీ మూవీ అన్న నమ్మకం ఏర్పడింది… బరిలీకి బర్ఫీ, శుబ్ మంగళ్ సావ్దాన్, అంధదూన్, బదాయిహో, ఆర్టికల్ 15 మరియు డ్రీమ్ గర్ల్ లాంటి బాక్ టు బాక్ సూపర్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్న ఈ హీరో…

కోవిడ్ తర్వాత కంప్లీట్ గా ఫామ్ కోల్పోయాడు. చేసిన సినిమా చేసినట్లు నిరాశ పరచగా తన లేటెస్ట్ మూవీ ఎన్ యాక్షన్ హీరో సినిమాకి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో రివ్యూలు సొంతం అయినా సినిమా మొదటి రోజు నుండే మినిమమ్ ఇంపాక్ట్ ని చూపించలేక పోయింది….

మొత్తం మీద 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో 11 కోట్ల లోపే కలెక్షన్స్ తో పరుగును పూర్తీ చేసుకుని భారీ డిసాస్టర్ గా నిలిచింది. బడ్జెట్ పరంగా చెప్పాలి అంటే 10% రికవరీ మాత్రమే చేసి ఎపిక్ డిసాస్టర్ అయింది. ఒకప్పుడు 6 వరుస హిట్స్ తో దుమ్ము లేపిన హీరో ఇప్పుడు కంబ్యాక్ కోసం కష్ట పడుతూనే ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here