బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ వీకెండ్ లో ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసే అవకాశం ఉన్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా కొన్ని పెండింగ్ పనుల వలన..
రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా సినిమా ఒకసారి నవంబర్ లో అని మరోసారి వచ్చే ఇయర్ ఎర్లీ సమ్మర్ లో అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతూ ఉండగా ఇప్పుడు నేషనల్ అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి మేకర్స్ నుండి ఒక వార్త వెళ్ళినట్లు సమాచారం.
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా ఈ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుందని మేకర్స్ మెయిల్ లో తెలియజేశారట… చాలా వరకు సినిమా డిసెంబర్ 22న క్రిస్టమస్ వీకెండ్ లో భాగంగా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటూ ఉన్నారు ఇప్పుడు…
అదే డేట్ కి సినిమా కన్ఫాం అయితే బాక్స్ అఫీస్ దగ్గర పోటి ఏం ఉన్నా కూడా క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ వీకెండ్ వరకు హాలిడేస్ అండ్ న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఈ సినిమా షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
సినిమా పై ఉన్న క్రేజ్ అండ్ బజ్ దృశ్యా డిసెంబర్ 22 న రిలీజ్ అయితే డిసెంబర్ 31 వరకు వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే కెపాసిటీ ఈ సినిమా కి ఎంతైనా ఉందని చెప్పాలి… మరి ఇదే డేట్ ని మేకర్స్ అఫీషియల్ గా త్వరలో అప్ డేట్ చేస్తారా లేక వేరే ఏదైనా డేట్ కి వెళతారో చూడాలి.