Home న్యూస్ పెద్దకాపు1 కి అక్కడ ప్రీమియర్ షో హౌస్ ఫుల్…అడ్డాల మాస్!

పెద్దకాపు1 కి అక్కడ ప్రీమియర్ షో హౌస్ ఫుల్…అడ్డాల మాస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మూవీస్ లో క్లాస్ డైరెక్టర్ గా పేరున్న శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పెద్దకాపు1(Peddakapu1 Movie) ఒకటి…కొత్త స్టార్స్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ పోటిలో…

రిలీజ్ అవుతున్నా కూడా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ లో కొంచం బజ్ ను పాజిటివ్ గా సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు… ట్రైలర్ కట్ లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ చూసి అసలు ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాలనే తీశాడా అన్న డౌట్స్ కూడా వచ్చాయి.

ఆ రేంజ్ లో మాస్ ఎలిమెంట్స్ తో కుమ్మేసిన అడ్డాల ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తన మ్యాజిక్ ను చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఆల్ రెడీ ఓపెన్ చేయగా కొన్ని చోట్ల రెస్పాన్స్ చూస్తామని స్పెషల్ ప్రీమియర్స్ ను కూడా…

అనౌన్స్ చేశారు… అందులో హైదరాబాదులోని సంధ్య 70MM థియేటర్ లో సినిమా ప్రీమియర్స్ ను ఓపెన్ చేయగా బుకింగ్స్ లో ఫుల్ జోరు కనిపించి ఇప్పుడు టోటల్ షో మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది. ఈ రెస్పాన్స్ చూసి ఇప్పుడు ఇతర చోట్ల కూడా సినిమా స్పెషల్…

పెయిడ్ ప్రీమియర్స్ ను వేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నారు. సినిమా పై మేకర్స్ లో కాన్ఫిడెన్స్ అండ్ ఆడియన్స్ లో ఆసక్తి పెరిగుతూ ఉండటంతో సినిమా కి టాక్ బాగుంటే ఈ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి అడ్డాల మాస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here