బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) ఎంత మాస్ మూవీనో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఆడియన్స్ ను బాగా అట్రాక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న ఈ సినిమా ఓవర్సీస్ లో క్లాస్ మూవీస్ ని…
ఎక్కువగా చూస్తారు కాబట్టి అక్కడ అద్బుతాలు సృష్టిస్తుంది అని ఊహించడం కష్టమే… బోయపాటి మూవీస్ కి అక్కడ ఇప్పటి వరకు పూర్ రెస్పాన్స్ సొంతం అవుతూ రాగా ఇప్పుడు ఊరమాస్ మూవీగా వచ్చిన స్కంద మూవీ…
ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. అమెరికాలో ఈ సినిమా ఇప్పుడు రామ్ కెరీర్ లో సెకెండ్ బెస్ట్ ప్రీమియర్ గ్రాస్ ను అందుకోవడం విశేషం. ఇది వరకు ఉన్నది ఒకటే జిందగీ సినిమా 110K డాలర్స్ ను అందుకోగా రెండో ప్లేస్ లో…
ఇస్మార్ట్ శంకర్ 51K గ్రాస్ ను అందుకుంది. అక్కడ రామ్ మూవీస్ కి కూడా అంతగా రెస్పాన్స్ సొంతం అవ్వలేదు. కానీ ఇప్పుడు స్కంద మూవీ రామ్ కెరీర్ లో అక్కడ టాప్ 2 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ 101K మార్క్ డాలర్స్ ను…
సొంతం చేసుకుని టాప్ 2 ఓపెనర్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత అమెరికాలో మరో 100K మార్క్ ని ఈ సినిమా అందుకోవడం విశేషం. క్లాస్ మూవీ అయితే ఈ మార్క్ డీసెంట్ అనుకోవచ్చు అలాంటిది ఊరమాస్ మూవీతో ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవడం ఊరమాస్ అనే చెప్పాలి.