ఒక సినిమా రిజల్ట్ మరో సినిమా మీద ఎంతో కొంత ఉంటుంది….పాత సినిమా భారీ విజయం ఎఫెక్ట్ కొత్త సినిమా మీద ఎంతో కొంత అడ్వాంటేజ్ గా పని చేస్తుంది.. లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఊహకందని రేంజ్ లో…
భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ది వాక్సిన్ వార్(The Vaccine War) సినిమా మీద డైరెక్టర్ భారీ హోప్స్ ను పెట్టుకోగా…
అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ప్రభాస్(Prabhas) నటించిన సలార్(salaar part 1 – ceasefire) సినిమా సెప్టెంబర్ 28న అనౌన్స్ చేసిన తర్వాత అదే డేట్ కి ఈ సినిమాను అనౌన్స్ చేశారు…సలార్ అయినా భయపడేది లేదు అంటూ డైరెక్టర్ కూడా కామెంట్స్ చేశాడు…
సలార్ పోస్ట్ పోన్ అవ్వడంతో ఇక ఈ సినిమా దుమ్ము లేపుతుందని అందరూ అనుకున్నారు.. 341 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత వచ్చిన ది వాక్సిన్ వార్ సినిమా కి యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా…
మొదటి రోజు కేవలం 85 లక్షల నెట్ ను రెండో రోజు 90 లక్షల రేంజ్ లో నెట్ ను మాత్రమే అందుకోగా డిసాస్టరస్ ఓపెనింగ్స్ తో అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది ఇప్పుడు. కానీ టాక్ పాజిటివ్ గా ఉండటంతో లాంగ్ రన్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో ఏమో చూడాలి.